హుజురాబాద్లో అరుదైన శస్త్ర చికిత్స

RARE SURGERY IN HUZURABAD 

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు ఓ గర్భిణీ కి అరుదైన శస్త్ర చికిత్స చేసి నిండు ప్రాణాలు కాపాడారు. అతి క్రిటికల్ కండీషన్ లో అత్యంత ప్రమాద స్థితిలో వున్న గర్భిణీకి సుమారు రెండు గంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి తల్లి బిడ్డల ప్రాణాలు నిలబెట్టి శభాష్ అనిపించుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొండెపి మండలం మొఘచింతల గ్రామానికి చెందిన ఏడుకొండలు, జయమ్మ దంపతుల కూతురు అనూష గర్భవతిగా నెలనెలా హన్మకొండలోని ప్రయివేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈక్రమంలో ప్రసవ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితి విషమంగా వుందని వెంటనే అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని ఇందుకు సుమారు 2 లక్షల పైచిలుకు ఖర్చవుతుందని ప్రయివేట్ వైద్యులు సూచించడంతో ఏమి చేయాలో పాలు పోక వారి ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే లాక్ డౌన్ కారణంగా వెళ్ల లేని ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. చేతిలో చిల్లి గవ్వ లేక, స్వగ్రామానికి వెళ్లలేక, కూతురి విషమ పరిస్థితి పై ఆందోళనతో విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాడె.రవి ప్రవీణ్ రెడ్డి & ఆర్ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి లను గర్భిణిని ఎలాగైనా ఆదుకోవాలని, అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించడంతో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సర్జన్  ఆధ్వర్యంలో వైద్య బృందం డాక్టర్ మీనా, డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ రమేష్, సిస్టర్ ప్రణీత, సిస్టర్ తిరుమల, సిస్టర్ తిరుమల ఏఎన్ఎం, సిస్టర్ సునీత, ఓటి అసిస్టెంట్ భద్రయ్య, బక్కయ్య తదితరులు అతి క్లిష్టమైన కేసును రెండు గంటలు శ్రమించి విజయవంతం చేసి తల్లి బిడ్డలను రక్షించారు, ప్రస్తుతం వారు క్షేమంగా వున్నారు.

* బతుకుదెరువు కోసం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి లో వుంటూ సుతారి పనులు చేసుకుంటున్న తాము దిక్కుతోచని స్థితిలో మంత్రికి విషయం తెలిసిన వెంటనే వైద్యులను పురామయించి తమ బిడ్డను రక్షించారని, మంత్రికి జన్మంత రుణపడి ఉంటామని వారు కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించిన హుజురాబాద్ వైద్యులను మంత్రి అభినందించారు.

TELANGANA LIVE UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *