సీఎం జగన్ ని అభినందించిన రాశీ ఖన్నా

Rashi Khanna Congratulates CM Jagan
నటి రాశీ ఖన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు అభినందనలు తెలిపారు. దిశా ఘటనపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచారం చేస్తే సత్వరమే శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకునేలా దిశా చట్టం అమలవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరం చేస్తే భయం అన్నది లేకుండా పోతుంది నేరగాళ్లకు. ఈ మేరకు ఏపీ సర్కార్ అత్యాచార ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. అందులో భాగంగా దిశ చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి సభ్యులు ఆమోదం తెలపడంతో చట్టం అమలైంది. ఇక దిశ చట్టంపై హీరోయిన్ రాశీ ఖన్నా తనదైన స్టైల్ లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం నిర్మాణాత్మకమైనదని అభిప్రాయపడ్డారు రాశికన్నా. మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్న వారిలో ఈ చట్టం భయాన్ని కలిగిస్తుందన్నారు. దిశ లాంటి చట్టాల్నిఅన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకువచ్చి మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని హీరోయిన్‌ రాశీఖన్నా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *