బాక్సర్ తో రొమాన్స్ కు భీష్మ బ్యూటీ

5
rashmika movie update
rashmika movie update

rashmika in boxer

కాంబినేషన్స్  మారిపోతుండటం సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. పైగా లక్కీ బ్యూటీ అన్న ట్యాగ్ పడితే చాలామంది హీరోలు వెంటపడుతుంటారు. మరోవైపు పరిశ్రమలో వచ్చే మార్పులు కూడా కొన్ని నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అందుకేనేమో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ ను మార్చేశారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ప్రామిసింగ్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్. రీసెంట్ గా గద్దలకొండ గణేశ్ అంటూ తన శైలికి భిన్నమైన ఆహార్యం, వాచకంతో  ఆకట్టుకుని కమర్షియల్ గానూ మంచి విజయం అందుకున్నాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జిగర్తాండా అనే తమిళ్ సినిమాకు రీమేక్ అయినా.. మన ఆడియన్స్ ను ఆకట్టుకునేలా హరీశ్ తో పాటు వరుణ్ కూడా చాలా కష్టపడ్డారు. మెప్పించారు.
ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ ‘బాక్సర్’అనే సినిమా చేస్తున్నాడు. ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉండాల్సింది.

లాక్ డౌన్ వల్ల అసలు షూటింగే స్టార్ట్ కాలేదు. కొన్నాళ్లు బాక్సర్ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ భామ ప్లేస్ లో రష్మిక మందన్నాను తీసుకుంటున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య రష్మిక నటించిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అలాగే బాలీవుడ్ లో నెపోటిజం కు వ్యతిరేకంగా సాగుతోన్న సోషల్ మీడియా వార్ సౌత్ లోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇద్ద్రరూ నెపోటిజం స్టార్సే అయితే.. కష్టం అనుకున్నారట. అందుకే సాయి మంజ్రేకర్ ను తప్పించి రష్మికను తీసుకోవాలని చూస్తున్నారట. కానీ ఇప్పుడు రష్మిక చిన్నా చితకా సినిమాలు చేసే పరిస్థితి లేదు. చేసిన తన పాత్ర బలంగా ఉండాలని నమ్ముతోంది. ఇది చిన్న సినిమా కాదు.. వరుణ్ మరీ చిన్న హీరో కాదు. అయితే టైటిల్ ను బట్టి చూస్తే హీరోయిన్ కు అంత ప్రాధాన్యత ఉంటుందా అనేది డౌట్. ఏదేమైనా డిమాండ్ లో ఉన్న భామలు కావాలంటే వారి డిమాండ్స్ ను కూడా చూడాలి.

tollywood news