రవి ప్రకాష్ కేసులో ఆ స్క్రీన్ షాట్లపై హోరాహోరీ వాదనలు

Spread the love

Ravi Prakash Case was in Fire

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. రవిప్రకాష్ సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్‌ను నిరాకరించాలంటూ ఆయన హైకోర్టులో తన వాదన వినిపించారు. దేవేందర్‌ అగర్వాల్‌ రాజీనామా లేఖలో సంతకం ఫోర్జరీ చేసిన విషయాన్ని ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ వారితో జరిపిన ఫోన్‌ చాటింగ్‌ స్క్రీన్ షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది.
ఇక టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సంబంధించి పోలీసులు స్క్రీన్ షాట్స్ ను హైకోర్టుకు సమర్పించడంపై ఆయన తరఫు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రవి ప్రకాష్ ఫోన్‌ సంభాషణలకు సంబంధించి స్క్రీన్ షాట్లను కోర్టుకు ఎలా సమర్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తన క్లయింట్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను స్క్రీన్ షాట్స్ ఎలా తెస్తారని అహ్లూవాలియా ప్రశ్నించారు. కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారని వాదించారు. టీవీ9 లోగో సృష్టికర్త రవి ప్రకాష్ అని, కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై పూర్తి హక్కు అతనికే ఉంటుందని అన్నారు. 2003 నుంచి టీవీ9 వ్యవస్థాపకుడిగా రవి ప్రకాష్ వ్యవహరిస్తూ వచ్చారని, సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకపోతే చాలా మంచిదని అన్నారు. రవి ప్రకాష్‌కు బెయిల్ ఇస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏవీ ఎదురు కాబోవని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన వాదించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హారెన్ రావెల్ కు కౌంటర్ గా ఆయన ఆ వాదనలు చేశారు. విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ హైదరాబాద్, బెంగళూరు తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారని రావెల్ వివరించారు. రూ.90 నుంచి రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99వేలకే రవిప్రకాష్ విక్రయించాడని, అలా ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తే.. కంపెనీకి తానే యజమానిని అని అంటున్నారని ఆయన అన్నారు. కేవలం 9 శాతం వాటా ఉన్న వాళ్లు ఎలా యజమాని అవుతారని న్యాయవాది ప్రశ్నించారు. అప్పుడు 90శాతం వాటా ఉన్నవారి పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *