ఖిలాడీ రవితేజ .. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్

6
raviteja movie
raviteja movie

ravi teja with two heroins

ఇద్దరు హీరోయిన్లు లేని సినిమాలు ఇవాళా రేపు చాలా అరుదైపోయాయి. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ కథల డిమాండ్ మేరకు ఎక్కువ శాతం ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కొందరైతే ఇద్దరు ఉండాల్సిందే అనే డిమాండ్స్ కూడా చేస్తారనే రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ మేటర్ ఎలా ఉన్నా.. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ కూడా కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఆ భామలు ఫైనల్ అయ్యారంటున్నారు. వీరిలో ఓ బ్యూటీతో ఆల్రెడీ ఈ బెంగాల్ టైగర్ లో ఆడిపాడాడు కూడా. రవితేజ.. ప్రస్తుతం క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ అనౌన్స్ కావడంతో ఆగిపోయింది. ఈ మూవీ తర్వాత వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు రవితేజ. వీటిలో నక్కిన త్రినాథరావు సినిమాతో పాటు రమేష్ వర్మ చిత్రాలు ముందుగా ప్రారంభం అవుతాయంటున్నారు. ఈ రెండు సినిమాలూ ఒకేసారి షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందట. అయితే రమేష్ వర్మ మూవీలో రవితేజ మరోసారి డ్యూయొల్ రోల్ చేస్తున్నాడని టాక్. ఈ రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని.. సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి డ్యూయొల్ రోల్ అంటే ఇద్దరు భామలు ఉండాలి కదా.

ఆ మేరకు దర్శకుడు ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేశాడట. కెరీర్ లో హిట్లు ఉన్నా పెద్దగా ఆఫర్స్ లేని బ్యూటీ రాశిఖన్నా ను రవితేజ సరసన ఓ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ సినిమా వచ్చింది. అలాగే మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ హాటీ నిధి అగర్వాల్ ను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు భామలూ గ్లామర్ పరంగా తిరుగులేదనిపించుకున్నారు. నిజానికి ఈ ఇద్దరూ రవితేజ సరసన నటిస్తారు అని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా వారినే ఫిక్స్ చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందట. రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్ లో గతంలో వీర అనే సినిమా వచ్చింది. కానీ ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదు. రమేష్ రీసెంట్ గా రాక్షసుడు సినిమాను రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. దీంతో చాలా కాలం తర్వాత పెద్ద హీరోతో వచ్చిన అవకాశాన్ని వినయోగించుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ మూవీ కోసం ఖిలాడీ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నాడట. ఈ టైటిల్ రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. మొత్తంగా వీర బాక్సాఫీస్ వద్ద వీరత్వం చూపించకపోయినా..  ఖిలాడీ అయినా ఖలేజా చూపుతాడేమో చూడాలి.

tollywood news