ఇంటర్నెట్‌ ఇక్కడే చీప్‌: కేంద్ర టెలికాం మంత్రి

ravishankar prasad says internet is very cheap in india
కాల్‌ ఛార్జీలు… డేటా ఛార్జీలు పెంచుతున్నట్టు టెల్కో కంపెనీలు ప్రకటించగానే కస్టమర్లంతా గగ్గోలు పెడుతున్నారు. ఫ్రీ సర్వీస్‌లకు అలవాటు చేసి ఇప్పుడు టెలికాం కంపెనీలు రేట్లు బాదాలని నిర్ణయించుకోవడంతో గుస్సా అవుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్‌ డేటా ధరలు చాలా తక్కువంటూ కేంద్ర టెలికాం ​మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ వేశారు. దీంతో ఏకంగా 50 శాతం టారిఫ్‌ రేట్లను పెంచుతూ దేశీయ టెలికాం కంపెనీలు తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థించేలా మంత్రి ట్వీట్‌ ​ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ​
బ్రిటన్‌కు చెందిన కేబుల్‌.కో.యూకే స్టడీలో ఈ విషయం వెల్లడైందంటూ నెంబర్లతో సహా ట్వీటారు రవిశంకర్‌ ప్రసాద్‌. దీనికి సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్‌ చేశారు. ఈ అధ్యయనంలో ఒక జీబీ డేటా సగటు ధర- భారత్‌లో 0.26 డాలర్లు కాగా… బ్రిటన్‌లో 6.66 డాలర్లు… అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు చూస్తే 8.53 డాలర్లుగా ఉంది. ​
అక్కడితో ఆగిపోలేదు కేంద్ర మంత్రి వర్యులు. మొబైల్‌ ఛార్జీల సమస్యంతా స్కామ్‌ల్లో మునిగితేలిన యూపీఏ ప్రభుత్వ ఘనతని… మేం అధికారంలోకి వచ్చాక అంతా సెట్‌రైట్‌ చేశామంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌ను ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఓ వైపు గత ప్రభుత్వాలను తిడుతూ… మరోవైపు కంపెనీల రేట్ల పెంపును సమర్థిస్తున్నట్టు చేసిన ట్వీట్లతో కేంద్రమంత్రి పైనా సటైర్లు పడుతున్నాయ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *