రవితేజకు ఇది ఆల్ టైమ్ డిజాస్టర్

RaviTeja AllTime Disaster

రవితేజ.. కొన్నాళ్లుగా ఫ్లాప్ అనిపించుకోవడానికే సినిమాలు చేస్తున్నాడా అనిపిస్తున్నాడు. మరీ బోర్ కొట్టిస్తున్నాడీ మధ్య. కనీసం అభిమానులకు సైతం నచ్చడం లేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన డిస్కోరాజాపై చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇది మరీ దారుణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న రవితేజ ఇప్పుడు మాగ్జిమం లాస్ లే ఇస్తున్నాడు. ఇక డిస్కోరాజా కలెక్షన్స్ చూస్తే ఇది రవితేజ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ త్రీలో ఉండే సినిమా అనిపించుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులకు కలిపి కేవలం 7 కోట్ల 48లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడం విశేషం. నిజానికి రవితేజకు ఉన్న స్టార్డమ్ తో పోలిస్తే.. ఈ మూవీ ఓపెనింగ్స్ తోనే అందులో సగానికి పైగా రాబట్టుకోవాలి. కానీ అతని క్రేజ్ పూర్తిగా పోయింది అనడానికి ఈ కలెక్షన్సే ఓ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. ఇవి ఇక్కడితో మాత్రమే ఆగవు. అతని రాబోయే సినిమాలపైనా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా క్రాక్ సినిమాకు తిప్పలు తప్పవు.

విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఫ్లాప్ ను రవితేజ పూర్తిగా దర్శకుడుపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడట. ఇందుకోసం తన అనుయాయులను ఉపయోగిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది మరీ దారుణం. సినిమా విడుదలకు ముందు దర్శకుడుని ఆకాశానికెత్తేసి.. ఇప్పుడు ఫ్లాప్ రాగానే అతన్ని కింద పడేయాలనుకోవడం అతని క్యారెక్టర్ ను తగ్గిస్తుందనే చెప్పాలి. ఏదేమైనా రవితేజ అంత చీప్ గా ఆలోచించడు అనే అనుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *