రామప్పకు యునెస్కో బృందం.. హెరిటేజ్ టెంపుల్ గా పోటీ

rayappa became heritage by unesco

రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యూనెస్కో బృందం రాష్ట్రానికి రానుందని తెలుస్తుంది. దీని గురించి పర్యాటక శాఖ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు . కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేతృత్వంలో జరిగిన ‘పర్యాటక మంత్రుల జాతీయ సమావేశానికి’ పార్థసారథి, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప తుది దశలో ఉందని చెప్పారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్‍, సైన్స్, కల్చరల్ఆర్గనైజేషన్‍(యునెస్కో) బృందం రామప్పను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే దిశలో పరిశీలన జరపనుందని వివరించారు.
పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ రాష్ట్రం విరివిగా ఉపయోగించుకుంటోందన్నారు. ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజానికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్ లో చేపట్టిన హెరిటేజ్ టూరిజం పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. జోగులాంబ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో చేర్చిన కేంద్రం, అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా లక్ష్యాలను రూపొందించుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోందని చెప్పారు. టూరిజం అభివృద్ధి, విస్తరణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ యోచిస్తోందని, దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన ‘టీహబ్’ సేవలను పరిశీలించాలని కోరారు.
ఇక యునెస్కో బృందం రామప్పకు రానున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తో పాటు పార్టీ నాయకులు రామప్ప సందర్శించారు. ఈమేరకు రామప్ప దేవాలయల పరిసర ప్రాంతాలు, శిల్పాల రమణీయత, గుడి నిర్మాణ వ్యవస్థ, తదితర అంశాలను పరిశీలించారు . వచ్చే నెల 25 వ తేదీన యునెస్కో బృందం రామప్పకు రానున్న నేపధ్యంలో అన్ని హంగులతో సంసిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను కోరారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం పోటీ పడుతున్న రామప్ప దేవాలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో నుంచి ఓ బృందం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వస్తోంది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని టూరిజం, కల్చర్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బి. వెంకటేశం చెప్పారు. రామప్పకు హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు చాలా కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు. హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు కోసం రాష్ట్రం నుంచి ఎంపికైన తొలి కట్టడం రామప్పని చెప్పారు. యునెస్కో ట్యాగ్‌‌‌‌‌‌‌‌ వచ్చేందుకు గుడికి మంచి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందన్నారు. గుడి దగ్గర సరైన పార్కింగ్‌‌‌‌‌‌‌‌, లాడ్జింగ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం లేదన్న విమర్శలకు వెంకటేశం స్పందిస్తూ.. సౌకర్యాలను హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు తర్వాత కూడా ఏర్పాటు చేయొచ్చని, ప్రస్తుతానికి గుడి కట్టడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. 2020కి గాను వరల్డ్‌‌‌‌‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు కోసం దేవాలయం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Janapriya Urban Farms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *