రియల్ మి 3 ఆవిష్కరణ

Spread the love

REALME 3 RELEASED

  • డ్యూయల్ బ్యాక్ కెమెరాతో రెండు వేరియంట్లలో లభ్యం
  • 12 నుంచి ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పోకి చెందిన రియల్ మి కొత్త ఫోన్ తీసుకొచ్చింది. రియల్ మి 3 స్మార్ట్ ఫోన్ ను సోమవారం విడుదల చేసింది. రియల్‌ మి 2తో పోలిస్తే డ్యూ డ్రాప్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ పై, డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలను ఇందులో ఏర్పాటు చేసింది. ఇక ముందువైపు 13 ఎంపీ సామర్థ్యం కలిగిన సెల్ఫీ కెమెరా ఉంది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 8999గా నిర్ణయించగా.. 4జీబీ ర్యామ్‌,32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 10999గా నిర్ణయించింది. మార్చి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

రియల్‌మి 3 ఫీచర్లు ఇవీ…
6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1520×72 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ పై
2.1 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ హీలియో పీ 70 ప్రాసెసర్
3/4జీబీ ర్యామ్‌,32జీబీ స్టోరేజ్‌
13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230 ఎంఏహెచ్‌ బ్యాటరీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *