సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ కాదు వస్తువుల సేకరణ కోసం వచ్చాం

Reason Behind Disha Case Encounter
దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో స్మాల్‌ క్లారిటీ. పోలీస్‌లు నిందితులను స్పాట్‌కి తెచ్చింది సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం కాదు- మిస్సైన దిశ వస్తువులను ​సేకరించడానికి. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్‌ స్వయంగా వెల్లడించారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అంటూ అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. హత్యాచారం చేసిన తర్వాత ​దిశ మొబైల్‌, పర్స్‌, వాచ్‌, పవర్‌బ్యాంక్‌ను నిందితులు ఘటనా స్థలం దగ్గరే పాతిపెట్టారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే పాతిపెట్టిన మొబైల్‌ను స్వాధీనం ​చేసుకొన్నారు. మిగిలిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవాలని భావించిన పోలీస్‌లు వాటిని ఎక్కడ పాతారో గుర్తించడానికి నిందితులను ఘటనా స్థలానికి ​తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీస్‌లపై తిరగబడటం… రాళ్లు రువ్వి ఆయుధాలు తీసుకోని పారిపోయే ప్రయత్నం చేయడంతో గతిలేని పరిస్థితుల్లో ​ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *