బీజేపీతో జనసేన పొత్తు.. ఖాయమా?

Reason Behind Pawan Kalyan meets Nadda

ఏపీ  రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న పవన్ అకస్మాతుగా ఢిల్లీ ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది . వీరి ఇరువురి మధ్య  పొత్తు కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బయటి నుంచి బీజేపీకి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పవన్ తన స్టాండ్ మార్చుకున్నారని సమాచారం. బీజేపీతో కలిసి పని చేయాలని పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రెండు పార్టీలు కలిసి పని చేయడంతో పాటు భవిష్యత్ కార్యచరణపై ఇరువురూ చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. ఈ భేటీలో రాజధాని రగడ గురించి నడ్డాకు పవన్ వివరించారని సమాచారం.

అయితే ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా ఉన్నాయి. రాజధాని మార్పు అంశం దుమారం రేపుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. అమరావతి రైతుల పోరాటం విషయంలో బీజేపీ కలిసి రావాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి పని చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ చెప్పినట్టు సమాచారం. జనసేనాని పవన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు బీజేపీ పెద్దలను కలిశారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో జనసేన తీసుకునే నిర్ణయం రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మీద ప్రభావం చూపిస్తుందా అన్నది వేచి చూడాలి .

Reason Behind Pawan Kalyan meets Nadda,Andhra pradesh, pawan kalyan, janasena , bjp, jp nadda, central government, support, capital farmers, alliance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *