ట్రంప్ మోడీకి ఎందుకు కాల్ చేశాడు?

Reason For Trump Called Modi

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీతో హఠాత్తుగా ఫోన్లో ఎందుకు మాట్లాడినట్లు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. మొన్న ఇరాన్ సైనికాధికారి ఖాసీంని హతమార్చిన తర్వాత ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లో కొన్ని వర్గాలు సీరియస్గా ఉన్నాయి. ట్రంప్ తలకు వెలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ మోడీకి కాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే, రెండు దేశాల మ‌ధ్య బంధాలు మ‌రింత దృఢంగా మారిన‌ట్లు మోదీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా న్యూ ఇయ‌ర్ విషెస్ కూడా ట్రంప్‌కు తెలియ‌జేశారు.

ఇద్ద‌రికీ ఆస‌క్తి ఉన్న అంశాల్లో క‌లిసి ప‌నిచేసేందుకు ఇష్టంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ట్రంప్‌కు, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, అమెరికా ప్ర‌జ‌ల‌కు మోదీ కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పార‌ని, వారికి ఆరోగ్యం, ఆయుష్షు ప్ర‌సాదించాల‌ని కోరుకున్న‌ట్లు పీఎంవో తెలిపింది. విశ్వాసం, గౌర‌వం, అవ‌గాహ‌న‌తో రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన బంధం రోజు రోజుకూ బ‌ల‌ప‌డుతున్న‌ద‌ని మోదీ తెలిపారు. అధ్య‌క్షుడు ట్రంప్ కూడా భార‌త ప్ర‌జ‌ల‌కు న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త్ సాధిస్తున్న ప్ర‌గ‌తి ప‌ట్ల ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

India vs America Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *