టెన్షన్ గా మారిన రెబల్స్..

Rebels Tension For TRS In Municipal Election

తెలంగాణాలో మున్సిపల్‌ ఎన్నికల పోరు హాట్ హాట్ గా జరగనుంది. నువ్వా నేనా అన్నట్లు తెరాస పార్టీ కాంగ్రెస్ తలపడబోతున్నాయి. ఈ మేరకు క్లిన్ స్వీప్ చేస్తామని తెరాస ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఏంటో తేల్చుకునేందుకు ఎన్నికల బరిలో దిగనుంది బీజేపీ పార్టీ. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలు తెరాస పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.టికెట్ల కోసం ఎదురుచూసిన ఆశావహులు రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. ఎవరికీ వారు సొంతంగా నామినేషన్లు వేస్తున్నారు. దీంతో తెరాస పార్టీకి ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే ఇలా చేస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు బేరసారాలు, బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. అయితే నేడు మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రెబల్స్ గా నామినేషన్ వేసిన వాళ్ళు వెనక్కి తగ్గుతారో లేదో అన్న టెన్షన్ తెరాస శ్రేణుల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో వార్డుల్లో, డివిజన్లలో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచేది ఎవరో నేడు సాయంత్రానికి తేలనుంది.

Rebels Tension For TRS In Municipal Election,#Municipal Election #TRS Party,#Municipal polls,#KTR,KTR convince rebels,#Rebel Trouble

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *