రెడ్ మీ నోట్ 6ప్రో ఫోన్ రూ. 2,799కే?

Spread the love

Redmi Note 6 Pro for Rs; 2,799 only

Check out The prize Here 

  • బై బ్యాక్ ఆఫర్ ప్రకటించిన షావోమి

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి మరో ఆఫర్ తో వచ్చింది. తన తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ ప్రో అతి తక్కువ ధరకే లభ్యం కానున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా బై బ్యాక్ ఆఫర్ లో భాగంగా రూ.2799కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. షరతులు వర్తించే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని వెల్లడించింది. రూ.2,799కే ఫోన్ కొనేసుకోవచ్చంటే కుదరదండోయ్. ప్రస్తుతం ఈ ఫోన్ ధర ప్లిఫ్ కార్ట్ లో రూ.13,999గా ఉంది. మనం అంత మొత్తం చెల్లించి ఈ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడు నుంచి ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఈ ఫోన్ ను మరో ఎంఐ నుంచి వచ్చే కొత్త ఫోన్ తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.11,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే ఇతర బ్రాండ్ ఫోన్లను తీసుకుంటే రూ.7వేల వరకు రాయితీ వస్తుంది. ఇది కూడా ఫోన్ కొనుగోలు చేసిన తేదీ నుంచి మూడు నెలల తర్వాత ఎనిమిది నెలల లోపు అయితేనే వర్తిస్తుంది. అదే తొమ్మిది నెలల నుంచి ఏడాది లోపు అయితే ఏ ఫోన్ తీసుకున్నా రూ.5,600 మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. పైగా ఫోన్ బాక్స్ తోపాటు ఇతర అన్ని యాక్ససరీస్ ఉంటేనే గరిష్ట డిస్కౌంట్ లభిస్తుంది. లేకుంటే ఆ మేరకు కోత తప్పదు. అంతేకాకుండా ఫోన్ పనిచేసే స్థితిలో ఉండాలి. పెద్ద పెద్ద స్క్రాచ్ లు, వంకర్లు ఉండకూడదు. మరోవైపు హై5 పేరుతో తన ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి తాజాగా రెడ్‌మి రూ.1500 డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది

Check out the price of Redmi note 6 pro in Amazon and FLIPKART

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *