కేసు లేదు.. రెండేళ్ల నుంచి జైలులోనే

RELEASE VARAVARARAO

వరవరరావు మీద గత రెండు సంవత్సరాలుగా ఏ కేసు ఫైల్ చేయకుండా ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపి నిర్బంధంలో ఉంచారని, ఆయన ఆరోగ్యం త్రీవంగా క్షిణించిందని తెలిసి ఆందోళన చెందుతున్నామని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. అయన ఉన్న జైలులో ఒక ఖైదీ కరొనతో మరణించిన నేపథ్యంలో ఆయనను బెయిల్ పై విడుదల చేయాలని పెట్టుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకుండా తాత్సరం చేస్తున్నారని విమర్శించారు. 80 సంవత్సరాల సీనియర్ రచయిత వరవరరావును విడుదల చేయనందున ఇప్పుడు త్రీవ అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత క్రూరమైన నిర్బంధకాండ. తక్షణం వరవరరావును ఆయనతోపాటు ఉన్న ఎల్గార్ పరిషద్ కేసులో ఉన్న రాజకీయ ఖైదీలందరిని వెంటనే విడుదల చేయాలని, వరవరరావును హైదరాబాద్ హాస్పిటలకు మార్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

cpi latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *