5జీ  చీపెస్ట్  ఫోన్లు…జియో సంచలనం

101
Reliance 5G Cheapest Phones
Reliance 5G Cheapest Phones

Reliance 5G Cheapest Phones

రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం  అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే 5జీ  చీపెస్ట్  ఫోన్లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 2016లో 4జీ సర్వీసెస్‌తో రంగంలోకి దిగిన రిలయన్స్ జియో ప్రస్తుతం లాభాల్లో ఉంది. తర్వాత జరగనున్న 5జీ స్పెక్ట్రమ్ బిడ్డింగులో జియో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

చైనాకు చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మేకర్ టాప్ ఎగ్జిక్యూటివ్  5జీ  చీపెస్ట్  ఫోన్ల విషయాన్ని తెలిపారు. అతి తక్కువ ధరలకే  5జీ స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చే సత్తా ప్రస్తుతం జియోకే ఉన్నట్టు ‘ట్రాన్సిషన్ ఇండియా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తాలపత్ర కూడా పేర్కొన్నారు. జియో తీసుకొచ్చే ఫోన్లలో ‘చవక’ అనేది చాలా ముఖ్యమైన విషయం కానుందన్నారు. 5జీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న నేపథ్యంలో టెలికం కంపెనీలకు ఇది పెద్ద పెట్టుబడిగా మారనుందని అరిజీత్ పేర్కొన్నారు. అయితే, ఇది ఆయా ఇన్వెస్టర్ల ఆసక్తి, బ్రాండ్ స్ట్రాటజీపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకసారి నెట్‌వర్క్‌ను చూసిన తర్వాత మాత్రమే కనీసం రూ.15 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఇండస్ట్రీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. 2021లో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Reliance 5G Cheapest Phones,reliance jio, 5g cheapest phones , china , smart phone maker , telecom industry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here