విశాఖలో సినీ ప్రముఖుల విగ్రహాల తొలగింపు

Spread the love

Removal of statues of film personalities in Visakhapatnam … tension

విశాఖ న‌గ‌రంలోని బీచ్ రోడ్డులో అర్ద‌రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆర్కే బీచ్ వ‌ద్ద అనుమ‌తి లేదంటూ మూడు విగ్ర‌హాల‌ను అధికారులు తొలిగించారు. నంద‌మూరి హ‌రికృష్ణ‌..అక్కినేని నాగేశ్వ‌ర రావు..దాస‌రి నారాయ‌ణ‌రావు విగ్ర‌హాల‌ను అధికారులు తొలిగించాల‌ని అర్ద‌రాత్రి బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. ఉద‌యం స‌మ‌యంలో వీటిని తొలిగించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తే..అభిమానుల నుండి నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యే అవ‌కాశాలు ఉండ‌టంతో అర్ద‌రాత్రి స‌మ‌యంలో వీటిని తొలిగించాల‌ని నిర్ణ‌యించారు.

నంద‌మూరి హ‌రికృష్ణ‌..అక్కినేని నాగేశ్వ‌ర రావు..దాస‌రి నారాయ‌ణ‌రావు విగ్రహాల ఏర్పాటుకు జరుగుతున్న పనులను గమనించిన స్థానికులు కొందరు, విశాఖకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని కోర్టును ఆశ్రయించగా, వాటిని వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో స్పందించిన పోలీసులు, కార్పొరేషన్ అధికారులు గత రాత్రి వీటిని తొలగించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సినీ ప్రముఖుల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేని విగ్రహాలను తొలగించే విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.కోర్టు ఉత్త‌ర్వులు అమ‌ల్లో భాగంగానే..విగ్ర‌హాల‌ను తొలిగించామ‌ని అధికారులు వివ‌రించారు.

విశాఖపట్టణం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఈమధ్య ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించడం జరిగింది. అయితే, తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *