9నెలల పాప ఎలాంటి బట్టలేసుకుంటుంది?

Renu Desai Comments On Disha Accused Encounter

దిశా ఘటనపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఇలా తదితర రంగాల వారు దిశా ఘటనపై మాట్లాడినవారే. అయితే తాజాగా దిశకు జరిగిన పోలీసులు చేసిన న్యాయంపై ఆమె స్పందించారు. దిశను హత్య చేసి చంపేసిన నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్ పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ స్పందించారు. గ్యాంగ్ రేప్ లు చేసేవారికి మరణశిక్ష సరైనదంటూ అభిప్రాయపడ్డ రేణు పలు రకాల విషయాలపై ఆమె మాట్లాడారు. ఇక మహిళా వస్త్రధారణ కారణంగానే ఈ హత్యాచారాలు జరుగుతున్నాయన్న కొంతమంది కామెంట్స్ పై ఆమె ఫైర్ అయ్యారు. మీరన్నట్లు మహిళా వస్త్రధారణ కారణంగానే హత్యచారాలు జరుగుతుంటే మరి 9నెలల పాప ఎలాంటి బట్టలు వేసుకుంది అంటూ మండిపడ్డారు. 9 నెలల పాపపై ఎందుకంత కర్కశంగా ప్రవర్తించారంటూ ప్రశ్నించారు. అసలు మగాళ్లు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు, దేవుడిపై ఉన్న భయం, భక్తి చట్టాలపై కూడా ఉండాలి. అప్పుడే నేరాలు కాస్తైనా తగ్గుతాయన్నారు.

Renu Desai Comments On Disha Accused Encounter,#DishaCase, #PawanKalyanWife, #Encounter, #Police, #9MonthsBaby, #Rape

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *