మెడికల్ కాలేజి అధ్యాపకులకు గుడ్ న్యూస్

3
retirement age of medical college teachers
retirement age of medical college teachers

retirement age of medical college teachers

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న అధ్యాపకుల పదవీవిరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అదే రీతిలో ప్రభుత్వ  ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి మెడికల్ కాలేజీలో పని చేసే అధ్యాపకుల పదవీవిరమణ వయసును 58 నుంచి 65కు పెంచుతూ ఈ బిల్లును తీసుకువస్తున్నాం. చాలా మంది అధ్యాపకులు పదవీ విరమణ చేసే వారు ఉన్నారు.  సరైన నిపుణులు దొరకడం లేదు. ఈ కారణంగా అనుభవజ్ఞులైన వీరి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 52 మంది ఫ్రోఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రోఫెసర్ల సేవలు వినియోగించుకునే వెసులు బాటు కలుగుతుంది.

రిక్రూట్ మెంట్ పై కేసులు పడి స్టేలున్నాయి.  ఉన్నటువంటి  అధ్యాపకులు రిటైర్ అవుతున్నారు. ఈ కారణం వల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతీఏడాది తగిన వసతులు, అధ్యాపకులు ఉన్నారా లేదని పరిశీలించి సీట్లుకేటాయిస్తుంది. సీట్లు కోల్పోకుండా ఉండకుండా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే పదవీ విరమణ వయోపరిమితి పెచండం జరుగుతుంది. నాన్ టీచింగ్ స్ఠాఫ్ కు పెంచడం లేదు. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే పదవీ విరమణ వయసును పెంచడం జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.