రెంటికీ చెడ్డ రేవడిలా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి

Spread the love

REVANTH REDDY BREAKING NEWS UPDATES

తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయారు. వారం పది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు… టీవీ వార్తల్లో వినిపించడం లేదు, పేపర్ వార్తల్లో కనిపించడం లేదు. ఏమై ఉంటుంది…? బీజేపీని పొగుడుతూనో, కాంగ్రెసును దూషిస్తూనో, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని తిడుతూనో, ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన ఈమధ్యన ఎందుకు సైలెంటయ్యారు ? దీని వెనుక పెద్ద కథే ఉందట.ఆయన పరిస్థితి ఇప్పుడు ‘రెంటికి చెడ్డ రేవడి’ లా తయారైందట.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీనే విమర్శించారు కోమటిరెడ్డి. తాను బీజేపీలో చేరబోతున్నట్టు, ఆ పార్టీలోనే భవిష్యత్ ఉంటుందని చెప్పి సంచలన ప్రకటనలు గుప్పించారు. బీజేపీలో తానే సీఎం అభ్యర్థి అంటూ ఆయన చేసిన ప్రకటనే ఇప్పుడు ఆయనను బీజేపీలోకి చేరకుండా అడ్డుకుంటోందన్న చర్చ పెద్ద యెత్తున సాగుతోంది. తాజాగా. బీజేపీలో చేరాలని ఆశపడ్డ కోమటిరెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ అధిష్టానం బ్రేక్ వేసింది.రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కలిసి కోమటిరెడ్డి తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. వీరిద్దరూ వ్యతిరేకించడంతోనే కోమటిరెడ్డి చేరికను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టిందన్న చర్చ సాగుతోంది. బీజేపీలోకి వెళ్తే తానే సీఎం క్యాండిడేట్ అని కోమటిరెడ్డి అదుపుతప్పి వ్యాఖ్యలు చేసారు. దాంతో అనాదిగా బీజేపీనే పట్టుకొని ఎదిగిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయన దూకుడుతో పార్టీకి నష్టమని, చేర్చుకోవద్దని అధిష్టానంతో చెప్పారట. ఈ నేపథ్యంలోనే, రాజగోపాల్ రెడ్డి సైలెంటయ్యారట. తెలంగాణ పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలన్న ఆయన డిమాండ్ చేశారని, అందుకే బీజేపీ దూరం పెట్టిందని తాజాగా వార్తలుగుప్పుమంటున్నాయి.

LATEST POLITICAL NEWS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *