ఎక్కడైనా.. ఎవరైనా.. ఫుట్ బాల్ ఆడేస్తా..

REVANTH REDDY FOOTBALL VIDEO

రేవంత్ రెడ్డిపై తాజాగా ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది . రాజకీయాల్లోనే కాదు.. తాను మైదానంలో కూడా ఒక ఆట  ఆడేస్తానని, అవతలి వాళ్లకు చుక్కలు చూపిస్తానని  కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఆటతో చెప్పేశాడు . తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు.. ఫుట్ బాల్ క్రీడాకారులతో కూడా మహా గొప్పగా ఆటాడాడు . ఇక రేవంత్ రెడ్డి  విషయంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను ఆయన ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.  రంగారెడ్డి జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు తదితర ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి  తాజాగా డ్రెస్ మార్చేసి వారితో కలిసి ఫుట్ బాల్ ఆడడం అందరినీ ఆకట్టుకుంది . మైదానాల్లో వసతుల కల్పనపై క్రీడాకారులను తెలుసుకోవడానికి వెళ్లిన రేవంత్ సరదాగా ఆటవిడుపుగా వారితో కలిసి ఫుట్ బాల్ ఆడాడు. ప్రొఫెషనల్ ప్లేయర్ గా  మైదానంలోకి బంతితో దూసుకెళ్లిన రేవంత్ రెడ్డి ఒక  గోల్  కొట్టగా.. మరొకటి తృటిలో మిస్ చేశాడు. ఏది ఏమైనా  మైదానంలో ఇంత చురుగ్గా ఆటగాళ్లతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన వైనం మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రేవంత్ ఫుట్ బాల్ క్రీడాశైలికి ఆయన ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన రేవంత్ ఫ్యాన్స్ ఫైర్ బ్రాండ్ ఎక్కడున్నా ఫైర్ బ్రాండే అని తెగ సంబరపడుతున్నారు.

tags : revanth reddy, malkaj giri mp , foot ball player, video viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *