Revanth Reddy Got Corona
రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. గత కొద్ది రోజుల్నుంచి ఆయన అస్వస్థతంగా ఉండటంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో, ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత కొంతకాలం నుంచి తనతో కలిసి తిరిగిన వారు, తనను కలిసినవారంతా క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆయన ట్విట్టర్ ద్వారా సూచించారు. ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.