Revanth Reddy Speech on Disha Incident in Lok Sabha
షాద్ నగర్ లో జరిగిన దిశ అత్యాచారం ,హత్య ఘటన పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మహిళా కమిషన్ నుంచి మొదలుకుని కేంద్ర మంత్రులు కూడా ఈ ఘటనపై స్పందించారు . కేంద్ర పశుసంవర్థ శాఖ మంత్రి అజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వంటి వారు దిశ కుటుంబాన్ని పరామర్శించారు. అటు రాహుల్ గాంధీ మొదలుకునిఅనేక పార్టీల నేతలు, కేంద్ర మంతులు,ఎమ్మెల్యే లు, ఎంపీలు, సెలబ్రిటీలు ఈ ఉదంతం పై స్పందించారు. ఇప్పుడు ఈ అమానుష గ్యాంగ్ రేప్ మరియు హత్య ఉదంతం పార్లమెంటును సైతం ఊపేస్తోంది.దిశ హత్య అత్యంత దారుణమైనదని, పోలీసుల వైఫల్యం వల్లే ఈ దుర్గటన జరిగింది అని చాలా మంది ఎంపీలు తెలిపారు. ఇక ఈ ఘటన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దిశ ఘటనకు ముందు కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది.
వరంగల్ లో తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. ఆ ఘటనలో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇచ్చింది. కానీ ఉరిశిక్షను హైకోర్టు జీవితకాలం శిక్ష మార్చుతూ హై కోర్టు తీర్పునిచ్చింది అని రేవంత్ రెడ్డి తెలిపారు. తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేసి, చంపిన హంతకుడికి ఉరిశిక్ష విధించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ తరుణంలోనే దేశంలో హైదరాబాద్ గానీ కోయంబత్తూరు గానీ మరేదైనా ప్రదేశం గానీ.. 2016 నివేదిక ప్రకారం.. రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ లో 4 వందలకుపైగా రేప్ కేసులు నమోదయ్యాయి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడగా, స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. నీ ప్రాంతం కాకుండా రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరో అవకాశం ఇవ్వగా మోడీ మన్ కీ బాత్ లో అంటూ మొదలుపెట్టడంతో రేవంత్ మైక్ మళ్లీ కట్ చేసారు. దీనితో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం హైదరాబాద్ దిశ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు అని స్పీకర్ పేర్కొన్నారు.