సర్పంచ్ నామినేషన్ వెయ్యకుండా రేవంత్ అనుచరుడి కిడ్నాప్

Spread the love

Revanth Reddy Supporter was kidnapped

రేవంత్ కు షాక్ .

రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన గొంతు మూగబోయింది. సైలెంట్ గా తన పని తాను చేసుకు పోతున్నా అడుగడుగునా ఆయనకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొడంగల్ లో రేవంత్ కు మరో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోగొట్టుకున్నది ఈ పంచాయితీ ఎన్నికల్లో తిరిగి రాబట్టుకోవాలని భావించి రేవంత్ చాలా కష్టపడుతున్నాడు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన టీఆర్ఎస్.. ఆయన్ను అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.
కొడంగల్ లో రేవంత్ ను చిత్తుగా ఓడించిన టీఆర్ ఎస్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.తాజాగా కొడంగల్ లో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి అనుచరుడైన విశ్వనాథ్ నిటూరు గ్రామం నుంచి కాంగ్రెస్ తరుఫున సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.కానీ నిన్న అర్ధరాత్రి దాటకా రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విశ్వనాథ్ ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఇప్పటివరకూ అతడి ఆచూకీ తెలియరాలేదు.
నామినేషన్ కు ఇదే చివరి రోజు కావడంతో విశ్వనాథ్ పోటీచేయకుండా అడ్డుకునేందుకే ఆయన ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి ఉంటారని రేవంత్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారన్నది మాత్రం తెలియరావడం లేదు.తన అనుచరుడు కిడ్నాప్ తో రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి వెళ్లారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులను ఆరాతీసి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విశ్వనాత్ బరిలో లేకుంటే గెలుస్తామనే దురుద్దేశంతోనే టీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని రేవంత్ మీడియా ఎదుట ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *