టీపీసీసీ అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి?

Spread the love

REVANTH WILL BE TPCC CHIEF

  • పరిశీలనలో శ్రీధర్ బాబు పేరు కూడా..
  • ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నాయకత్వ పగ్గాలు మారబోతున్నాయి. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో  ఆ పదవి ఇవ్వడానికి సరైన వ్యక్తి ఎవరా అని కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ విషయంలో అందరి కంటే ముందు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారు. దూకుడుగా వ్యవహరించే రేవంత్ అయితేనే ఆ పదవికి సరిపోతారని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు సమాచాం. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అసెంబ్లీతోపాటు పంచాయతీ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మరీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ సంచలన కామెంట్లు చేశారు. దీనిపై కాక రేగుతుండగా.. రాష్ట్ర నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. టీపీసీసీ చీఫ్ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న నేతల్లో గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి రేవంత్ మాత్రమే అని, సీఎం కేసీఆర్ తోనే తలపడుతున్న ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని పలువురు నేతలు సూచించినట్టు చెబుతున్నారు. మరోవైపు శ్రీధర్ బాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డే శ్రీధర్ బాబు పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అంశంపై అధిష్టానం ఆరా తీస్ది. మొత్తమ్మీద ఈ ఇద్దరిలో ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వడం ఖాయమైందనే ప్రచారం సాగుతోంది.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *