రెవెన్యూ అధికారులు ఆ ఎమ్మెల్యేను వేధిస్తున్నారట

Revenue employees are harassing to MLA 

రెవెన్యూ కార్యాలయాల్లో నెలల తరబడి పనులు పెండింగ్లో ఉంటున్నాయి.  రెవెన్యూ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడి పనులు త్వరితగతిన చేయడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో  నేను కూడా బాధితుడినే అంటూ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు  తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. ఇటీవల ఏసీబీ అధికారులపై డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటన మరవకముందే ఉద్యోగులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రభుత్వ మంత్రుల ఎదుటే తన గోడు వెల్లబోసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో తనకు ఆరు నెలలుగా పాస్‌బుక్‌లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణల ఎదుట ఎమ్మెల్యే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తనకే పాసు పుస్తకాలు రాకుంటే.. ఇక సాధారణ ప్రజలు, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా సమావేశంలో ఎమ్మెల్యే ఫిర్యాదు అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. మరోవైపు, తెలంగాణాలో రెవెన్యూ ఉద్యోగి విజయారెడ్డి హత్యకు గురైన నేపధ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఒక ప్రజా ప్రతినిది సైతం ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం పెను దుమారంగా మారింది.
tags : andhra pradesh, salooru, rajanna dora, revenue employees, pass books, minister srivani, botsa sathyanarayana

పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు పనులకు బ్రేక్ 

ఆర్టీసీలో ప్రైవేటీకరణపై పిటీషన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *