ఆర్టీసీ కార్మికులతో పాటు రెవెన్యూ ఎంప్లాయిస్ సమ్మె బాట

Revenue Employees strike along with RTC workers

ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో  తెలంగాణ  ప్రజానీకం చాలా ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. దసరా సమయంలో ఆర్టీసీ కార్మికులు  సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఇక కేసీఆర్ ఉద్యమాన్ని అణచివేయటం  కోసం సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.  ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం అవుతూ ఉంది.
అయితే పోరాటాలు , ఉద్యమాలు, సమ్మెలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తేమీ కాదు. ఉద్యమాల ఫలితమే నేడు తెలంగాణా రాష్ట్రం .  ఆ సంగతలా ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న ఇతర ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా సకల జనుల సమ్మె సాగబోతోందని  వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం మరింత ఇబ్బందిలో పడుతుంది.  ఈ రోజు ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ విధానం రేపు రెవెన్యూ ఉద్యోగులపై కూడా ఉంటుందని భావించి ప్రభుత్వ తీరుపై నిరసన భావంతో రెవెన్యూ ఎంప్లాయిస్ కూడా ఇదే ఊపులో సమ్మెకు వెళ్లబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులకూ – కేసీఆర్ కు అస్సలు పడటం లేదు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే నెపంతో అసలు రెవెన్యూ శాఖనే లేకుండా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్ . ఈ రచ్చ చాలా కాలం నుండి నడుస్తుంది.ఇలాంటి పరిణామాల్లో ఆ ఉద్యోగ సంఘాల వాళ్లు సమ్మెకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా సమాచారం. మరి వారు కూడా సమ్మె బాట పడితే టీఆర్ ఎస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

tags : rtc strike, ts rtc, revenue department , employees, support , protest, cm kcr

 హుజూర్ నగర్ లో టఫ్ ఫైట్

ఏపీలో రైతులకు మరింత భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *