అవినీతి కూపంగా రెవెన్యూ …

Revenue is Care of Address to Corruption

అవినీతికి అడ్డాగా మారిపోయింది రెవిన్యూ శాఖ.  వీఆర్వో దగ్గర్నుండి ఆర్డీవో వరకు అవినీతి ఎంతగా పెరిగిందంటే ప్రజల నుండి తీవ్ర విమర్శలు  ఎదుర్కొనేంతగా  పెరిగిపోయింది.  ఇక ప్రభుత్వ అధికారుల్లో ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో సగానికి సగం మంది ఉద్యోగులు  రెవిన్యూ  ఉద్యోగులే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత  ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  గత రెండేళ్లలో  ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులు 207 మంది ఉంటే వారిలో 50 మంది ఉద్యోగులు  రెవిన్యూ ఉద్యోగుల ఉండటం  గమనార్హం.
గత రెండేళ్లలో  ఏసీబీ అధికారుల  ట్రాప్ లో చిక్కిన రెవెన్యూ అధికారుల  జాబితా చూస్తే  ఖచ్చితంగా షాక్ అవుతారు.  నెలకు ఇద్దరు  రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.   2018, 2019 సంవత్సరాలలో   ఏసీబీ అధికారులకు పట్టుబడిన రెవెన్యూ ఉద్యోగుల జాబితా చూస్తే  రాష్ట్రంలో  రెవెన్యూ శాఖలో అవినీతి అంతగా పెరిగి పోయిందో  అర్థం చేసుకోవచ్చు.  ఇక ఈ అవినీతి  నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కఠిన నిర్ణయం  తీసుకున్నారు.
గత రెండేళ్లలో రెవెన్యూ శాఖలో పట్టుబడిన అధికారుల జాబితా చూస్తే  అవాక్కవుతారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన రెవిన్యూ   అధికారుల జాబితా.
సూర్యాపేట జిల్లా సింగారెడ్డి పాలెం చెందిన విఆర్ఓ నారాయణ ,  5 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.  ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆర్డీవో శ్రీనివాస్  బాలే 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.  ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన జిల్లెల్ల గ్రామ విఆర్వో అంజయ్య 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన సనుగుల గ్రామ విఆర్వో రాములు అద్దేపల్లి పది వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.  మంచిర్యాల జిల్లా   మల్యాల గ్రామ వీఆర్వో ఇక్బాల్  మహమ్మద్ నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టు బడగా,  భూపాలపల్లి జిల్లా కు చెందిన ఆర్ డి ఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పిండి  50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా   మన్వాడ గ్రామ వీఆర్వో జనార్దన్  ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడగా, పెద్దపల్లి జిల్లా  మొట్లపల్లి గ్రామ విఆర్వో కొమరయ్య ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.  ఇక వనపర్తి జిల్లా కొత్తకోట కు చెందిన తహసీల్దార్ మల్లికార్జున్ రావు  లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా , వనపర్తి ఆర్డీవో చంద్రారెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆయన పైన కేసు నమోదు చేశారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్ రాజు  30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా ,  జగిత్యాల నడికుడ గ్రామానికి చెందిన విఆర్వో మహమ్మద్ రఫీ  ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
నాగర్ కర్నూల్ ఉప్పునూతల విఆర్వో వెంకటయ్య 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా , కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామ విఆర్వో సురేందర్  5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
పెద్దపల్లి జిల్లా విఆర్వో మహేందర్  5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గా మేడ్చల్ జిల్లా పల్లి డిప్యూటీ తహసిల్దార్ శ్రీదేవి  మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు నల్గొండ చెట్ల చెన్నారం గ్రామ విఆర్వో లక్ష్మీ నరసింహారావు 30000 లంచం తీసుకుంటూ ఏసీబీకి  చిక్కగా,  మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ రెడ్డి 10,000 లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు. మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామ విఆర్వో గౌసియా బేగం 8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల సర్వేయర్ హరికృష్ణ  5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
వరంగల్ జిల్లా వంగర గ్రామ విఆర్వో రమేష్ గుమ్మడి 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా  ఆదిలాబాద్ కప్పరాళ్ల గ్రామ విఆర్వో సుశీల రాథోడ్ 9 వేలు  లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  పెద్దపల్లి జిల్లా పూర్ విఆర్వో మహేష్ 14000 లంచం తీసుకుంటూ చిక్కగా,   గుండియా పల్లి గ్రామ విఆర్వో దుర్గయ్య 5 వేలు లంచం తీసుకుంటూ చిక్కారు.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి  మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతి మూడు వేలు లంచం తీసుకుంటు  దొరకగా,  గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడు వీఆర్వో మద్దిలేటి చాకలి 10,000 లంచం తీసుకుంటూ  పట్టుబట్టారు. వరంగల్ రూరల్ జిల్లా నడిగూడెం మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సంపత్ 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా , గద్వాల జిల్లా ఎల్కూర్ గ్రామ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ చిన్నయ్య 15 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్ 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడగా , ఖమ్మం జిల్లా ముదిగొండ విఆర్వో రాజేంద్రం 5 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. రంగారెడ్డి జిల్లా ఏపూర్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్  ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరకగా, నాగర్ కర్నూలు జిల్లా మారేడు మాన్దిన్నె విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ శ్రీధర్ 5000 లంచం  తీసుకుని పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా  బేతుపల్లి టు విఆర్వో వెంగల్ రావు  18 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా , ఇల్లందకుంట రామన్న పల్లి గ్రామ  వీఆర్ఏ రామకృష్ణ రెండు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.  ఇక ఈ వ్యవహారంలో ఇల్లంతకుంట తహసిల్దార్ రవి రాజకుమార్ మీద కూడా కేసు నమోదైంది.
సిరిసిల్ల జిల్లా సర్వేయర్ సత్యనారాయణ ఇరవై వేలు లంచం తీసుకుంటూ పట్టు బడగా సూర్యాపేట గరిడేపల్లి డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ 8 వేలు లంచం తీసుకుంటూ  పట్టుబడ్డారు. కాళేశ్వరం సూరారం క్లస్టర్ విఆర్వో కిష్టయ్య 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా  సంగారెడ్డి జిల్లా  మన్నాపూర్ విఆర్వో  అయూబ్అబ్దుల్  15 వేలు లంచం తీసుకుంటూ  పట్టుబడ్డారు. మంచిర్యాల  డివిజనల్ అడ్మినిస్ట్రేటర్ మనోహర్ రావు 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా , మహబూబాబాద్ జిల్లా  మద్ది వంచ గ్రామ విఆర్వో శివ రావు  144000 లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
ఇక జగిత్యాల జిల్లా  మేడిపల్లిగ్రామ విఆర్వో బాపయ్య మూడు వేలు లంచం తీసుకుని చక్కగా, కామారెడ్డి జిల్లా బేగంపూర్ గ్రామ విఆర్వో శంకర్  8 వేలు లంచం తీసుకుని  చిక్కారు.  యాదాద్రి భువనగిరి జిల్లా  సుద్దాల గ్రామ విఆర్వో శ్రీనివాస్  42 వేలు లంచం తీసుకుంటు  పట్టుబడగా, రంగారెడ్డి జిల్లా కొండర్గు  వీఆర్వో అనంతయ్య నాలుగు లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు.  ఇక ఇందులో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య పై కేసు నమోదు చేశారు.  ఇక రంగారెడ్డి జిల్లాలో మల్లాయిల్  మండల జూనియర్ అసిస్టెంట్  మీర్జా ఫర్వేజ్ బేగ్  రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడగా , సంగారెడ్డి జిల్లా ఆందోల్  మండల సీనియర్ అసిస్టెంట్  నరసింహులు 5 వేలు లంచం తీసుకుంటూ చిక్కారు.  అబ్దుల్లాపూర్ మేట్   తుర్కయంజాల్  వీఆర్వో శంకర్ 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ గా,  నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల  చైన్  మ్యాన్ బ్రహ్మం   8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  ఇక పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామ విఆర్వో లింగస్వామి 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
tags: telangana, revenue department, cm kcr, acb raids, revenue employees, corruption

ఆర్టీసీ సంస్థకు షాక్ ఇచ్చిన పీఎఫ్ ఆఫీస్ 

అయోధ్య తీర్పు నేపధ్యంలో రైల్వే భద్రత పై కీలక నిర్ణయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *