మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుంటున్నాడా?

2
RGV allu
RGV allu

RGV allu

రామ్ గోపాల్ వర్మ.. మైండ్ కు ఏది అనిపిస్తే అదే ట్వీటుతూ.. మనసుకు ఏది తోస్తే అదే సినిమాగా తీస్తూ.. వెళుతున్నాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమాకే గ్రేట్ టెక్నీషియన్ అనిపించుకున్న అతను ఇప్పుడు చీప్ టెక్నీషియన్ గా మారిపోయి చాలాకాలమే అవుతోంది. ఈ మధ్య పరిశ్రమతో పాటు బయటి వ్యక్తులనూ పర్సనల్ గా టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ.. ‘పవర్ స్టార్’ అని తీశాడు. ముందే చెప్పినట్టు.. ఇది అత్యంత చీప్ గానే ఉంది. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీని వదిలి ఏకంగా అల్లు అరవింద్ తోనే పెట్టుకోబోతున్నాడు. ‘అల్లు’ అనే టైటిల్ తో తను సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. అయితే ఇది చాలామంది ఊహించిందే. పవన్ కల్యాణ్ తర్వాత అతని టార్గెట్ అరవిందే అని గతంలోనే అనుకున్నారు. కాకపోతే ఈ సారి అప్రోచ్ మరింత కాంట్రవర్శీయల్ గా ఉంది వర్మది. ఈ మేరకు అతను చేసిన ట్వీట్స్ చూస్తే.. ‘ రామ్ గోపాల్ వర్మ వరల్డ్ థియేటర్ నుంచి మరో ఫిక్షన్ సినిమా రాబోతోంది. టైటిల్ ‘అల్లు’’. ఒక పెద్ద స్టార్ వెనక ఉండి కుటుంబ బాధ్యత తీసుకున్న ఓ బావమరిది కథ ఇది. పూర్తిగా కల్పితం. ఈ కథ ఆ పెద్ద స్టార్ ‘‘జనరాజ్యం’ అనే పార్టీ స్థాపించిన తర్వాత నుంచి మొదలవుతుంది’’ అనే ట్వీట్ తో మొదలుపెట్టాడు.

ఆ తర్వాత కూడా వరుసగా అల్లు సినిమాలో  ఏ అరవింద్, కె చిరాంజీవి, ప్రవన్ కళ్యాణ్, ఏ ఆర్జున్, ఏ శీరేష్, కె.ఆర్ చరణ్, ఎన్ బేబూ ఎట్సెట్రా ఎట్సెట్రా నటిస్తున్నారు అని చెప్పాడు. అంటే మొత్తం మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసినట్టుగా భావించొచ్చు. ఇదే కాదు ఇంకా.. ‘‘అల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ ‘అల్లు’తూ ఉంటాడు. తనకి మంచి జరగాలంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటజీతో ప్లాన్ ల అల్లుడులో ఆరితేరిపోయిన, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి ‘‘అల్లు’’డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు.. ’’ ఇలా కంటన్యూ చేస్తూ.. ‘‘అందరితో ‘‘ఆహా’’ అనిపించుకోవడానికి తనకి కావాల్సిన వాళ్లకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ ‘‘అల్లు’’ .. అంటున్నాడు. మొత్తంగా ఈ సారి వర్మ చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. దాన్ని అతను రీచ్ అవుతాడా లేక మెగా ఫ్యామిలీ చేతిలో తూఛ్ అవుతాడా అనేది చూడాలి.

tollywood news