వర్మా.. ఏందయ్యా ఈ ‘క్లైమాక్స్’అరాచకం

RGV Climax

రామ్ గోపాల్ వర్మ .. ఏం చేసినా సంచలనమే.. అతను చేసిందే సంచలనం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఒకప్పుడు ఇండియన్ సినిమాకు రివల్యూషనరీ మార్పుల చూపించిన వర్మ.. ఆల్ టైమ్ గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకడు అనిపించుకున్నాడు. కానీ అతన్లో ఇప్పుడు ఆ ‘టచ్’పోయింది. పరమబోరింగ్, బోకు సినిమాలు తీస్తున్నాడు. అదేమంటే నా ఇష్టం అంటాడు కాబట్టి.. అతని సినిమాలు బోకులు అనడంలో తప్పేం లేదేమో. మొత్తంగా అతను ఎప్పుడో సి గ్రేడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో సెమీ పోర్న్ మూవీ‘క్లైమాక్స్’తో వస్తున్నాడు.
ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’(జీఎస్టీ)అంటూ పోర్న్ స్టార్ మీయా మాల్కోవాతో కేవలం శృంగార భంగిమలతోనే ఓ వీడియో చేసిన వర్మ ఈ సారి ఏకంగా అదే భామతో క్లైమాక్స్ అంటూ ఓ థ్రిల్లర్ సినిమా తీశాడు. అవును తీశాడు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. మొన్నా మధ్య ఓ టీజర్ విడుదల చేశాడు. ఇది రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక తాజాగా ట్రైలర్ వదిలాడు. ఊహించినదానికంటే ఎక్కువే మసాలా కనిపిస్తోందీ ట్రైలర్లో.

అయితే ఎప్పట్లానే ఇందులో కథ, కాకరకాయల విషయంలో వర్మ మరీ ఎక్కువ కసరత్తులేం చేయలేదు. ఓ యువ జంట ఎంజాయ్ చేయడానికి ఎడారిలోని ఓ ఒయాసిస్సుకు వెళుతుంది. అయితే అది రెస్ట్రిక్టెడ్ ఏరియా. అయినా వెళ్లిన ఆ జంట ఓ ఒయాసిస్ లో శృంగారంలో మునిగి ఉండగా సడెన్ గా వారిపైకి కొందరు వ్యక్తులు దాడి చేస్తారు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని చంపేస్తాడు. మరి వాళ్లెవరు.. వారి నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అనేది కథ అనుకోవాలని ట్రైలర్ తో చెప్పాడు వర్మ. అయితే ఇలా ఉంటే ఇంత ఎందుకు మాట్లాడతాం. ఇందులో అంతా వర్మ మార్క్ పైత్యం కనిపిస్తుంది. ప్రతి షాట్ లోనూ శృంగారమే కనిపించాలన్న తాపత్రయం ఉంది. ఇక ఓ దశలో మియా మాల్కోవాను పూర్తి నగ్నం(ఆమెకు ఏ అభ్యంతరం లేకపోవచ్చు)గా చూపించి బాబోయ్ అనిపించాడు. అయితే ట్రైలర్ కే కాదు.. ఒకవేళ విడుదలైనా సినిమా మొత్తానికి ఈ ట్రైలర్ లోని చివరి షాట్ హైలెట్ అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి షాట్స్ పెట్టడంలో వర్మకు మాత్రమే సాధ్యం అనిపించే థాట్స్ ఉంటాయి అతనికి. మొత్తంగా ఈ క్లైమాక్స్ చివరికి ఏ యూ ట్యూబ్ లోనో విడుదలవుతుందని వేరే చెప్పక్కర్లేదేమో.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *