కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ

RGV movie on corona

రామ్ గోపాల్ వర్మ.. సెన్సేషనలిజానికి రూపం వస్తే అతనవుతాడు. ఏం చేసినా జనం మాట్లాడుకునేలా చేయడంలో వర్మను మించిన వాడు వాల్డ్ లోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అంటూ జనమంతా ఇళ్లకే పరిమితం అయితే అతను మాత్రం ఏకంగా మియా మాల్కోవాతో క్లైమాక్స్ అంటూ సినిమా తీశాను అని చెప్పాడు. ఇక లేటెస్ట్ గా కరోనా వైరస్ పైనే ఓ సినిమా చేశాడు. అంతేనా.. ఏకంగా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేసి ఫైనల్ గా ప్రపంచంలోనే తొలి కరోనాపై తీసిన సినిమా అంటూ క్రెడిట్స్ కూడా వేసుకుంటున్నాడు. కాకపోతే ఈ చిత్రానికి వర్మ దర్శకుడు కాదు.. ఎప్పట్లానే ఓ షాడోను పెట్టాడు. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తీసిన అగస్త్య మంజును దర్శకుడుగా చెబుతున్నాడు. కానీ నిర్మాణం వర్మదే.
కరోనా విజృంభిస్తోన్న టైమ్ లో ఓ ఇంటికి సంబంధించిన కథతో తీశాడు దీన్ని అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఓ ఇంట్లో ఉన్న అమ్మాయి రాత్రంతా దగ్గుతూనే ఉంటుంది. ఆ విషయం ఉదయాన్నే ఇంటి పెద్దకు మిగతా వాళ్లు చెప్పినా పెద్దగా పట్టించుకోడు. పైగా మనం కరోనా రూల్స్ అన్నీ పాటిస్తున్నాం కాబట్టి మనకు రాదు అంటూ మొండివాదన చేస్తాడు. కట్ చేస్తే ఆ ఇంట్లోనే మరో వ్యక్తి దగ్గడం మొదలుపెడతాడు. చివరికి ఇళ్లంతా అలాగే అవుతారు. ఓ రకంగా దెయ్యం సినిమా ఫార్మాట్ లో కనిపిస్తోన్న ఈ వ్యవహారం చూస్తే వర్మ లాంటి వాడు ఏదైనా చేయగలడు అని ఎందుకంటారో అర్థమౌతుంది. నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ కే హైలెట్ ఏంటంటే ఆ చివరి డైలాగ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో చెప్పిన పారాసెట్ మాల్ గోలీలు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పిన మాటతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాటలనే వీడియోలో ఉంచాడు. ఆ రకంగా ఈ వీడియోలోని తండ్రి పాత్రకు వారి మాటలను లింక్ చేస్తూ ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని తేల్చిపడేశాడు. అయితే ఎప్పట్లానే వర్మ తీసిన చాలా ట్రైలర్స్ లానే ఇది కూడా సినిమా వరకూ రాకపోవచ్చు అని చెప్పొచ్చు.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *