రామ్ గోపాల్ వర్మ .. మరో భయం

2
varma shifted to goa
varma shifted to goa

RGV new movie

కాంట్రవర్శీయల్ కింగ్ గా దేశవ్యాప్తంగా చెప్పుకునే ఏకైక పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఇండియన్ సినిమా గతిని మార్చివేసిన దర్శకుడుగా పేరున్న వర్మ.. ఇప్పుడు గతి తప్పిన సినిమాలు చేస్తూ..ఆ వర్మేనా ఈ వర్మ అని అతన్ని అభిమానించేవాళ్లు కూడా ఈసడించుకునే సినిమాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో ఎవరికి వారు భయం గుప్పెట్లో ఇళ్లు కదలకుండా ఉంటే వర్మ ఏకంగా ‘క్లైమాక్స్’, ‘నేకెడ్’అంటూ రెండు సినిమాలు తీసి దేశాన్నే ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాలు అతని దిగజారుడు తనానికి నిదర్శనంగానే చూశారు చాలామంది. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాల దర్శకులు వేరే. తను నిర్మాణంలో భాగస్వామి మాత్రమే. కాకపోతే అవి అమ్మేది అతని పేరు మీదే. ఈ టైమ్ లో ఇప్పుడు ‘12ఓ క్లాక్’ అంటూ మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి మూడు ప్రత్యేకతలున్నాయి. చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ ఓ హారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అలాగే భారీ చిత్రాలకే సంగీతం అని భీష్మించుకున్న కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అలాగే ఒకప్పుడు టాప్ మోస్ట్ యాక్టర్స్ అనిపించుకున్నవాళ్లలో కొందరైన మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, మకరన్ దేశ్ పాండే లతో పాటు ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో బి గ్రేడ్ సినిమాలు చేస్తోన్న ఒకప్పటి లక్స్ పాప ఫ్లోరా శైనీ(ఆశా శైనీ) కీలక పాత్రల్లో నటిస్తుండటం.

ఇక ఈ మూవీ ట్రైలర్ వర్మ గత చిత్రాల బిల్డప్ షాట్స్ కు ఏ మాత్రం తగ్గేలా లేదు. అన్నీ రొటీన్ షాట్స్ లానే కనిపిస్తున్నాయి. నిజానికి ప్రేక్షకులను భయపెట్టాలని వర్మ చాలాయేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గతంలో రాత్రి, దెయ్యం, మఱ్రిచెట్టు, భూత్ అంటూ చాలా ప్రయత్నాలే చేసినా చాలా వరకూ ఆయా సినిమాలతో నవ్వించాడు. అలాగే రాజశేఖర్ తో చేసిన ఓ హారర్ మూవీ విడుదల కాలేదు. ఇప్పుడు మరోసారి ‘12 ఓ క్లాక్’ అంటూ వస్తున్నాడు. ఏదేమైనా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం పై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బట్.. ఒక రకంగా చూస్తే వర్మ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాల కంటే కాస్త బెటర్ గా ఉంటుందేమో అని ఈ ట్రైలర్ చూస్తే ఎప్పట్లానే అనిపిస్తోంది.

tollywood news