సినిమా చూపించిన రామ్ గోపాల్ వర్మ

3
varma shifted to goa
varma shifted to goa

RGV powerstar

తన గురించి ఎక్కువ డిస్కషన్స్ జరిగేలా చూడ్డం.. ఆ తర్వాత అందరినీ ఫూల్స్ చేయడంలో వర్మను మించిన వారు ఎవరున్నారు. ఈ సారి కూడా అంతా ఊహించినట్టుగా కాకుండా తన స్టైల్లోనే మరోసారి ఆడియన్స్ ను ఫూల్ చేశాడు వర్మ. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పై సినిమా చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. ‘పవర్ స్టార్’ అనే టైటిల్ తో పూర్తి కాంట్రవర్శీయల్ ట్రైలర్ తో ఒక్కసారిగా హైప్ పెంచాడు. ఏకంగా ఈ మూవీ ట్రైలర్ కు కూడా ఓ రేట్ ఫిక్స్ చేసి ఆనక వదులుకున్నాడు. మొత్తంగా పవర్ స్టార్ ను తన సొంత ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేశాడు వర్మ. ఇప్పటికే అతనిపై చాలా గుస్సాగా ఉన్న పవన్ ఫ్యాన్స్ అంతా ఏకంగా 150 రూపాయలు పెట్టి సినిమా చూశారు. ఇక్కడే అందరికీ షాక్ ఇచ్చాడు వర్మ. 150 రూపాయలు పెట్టి పవర్ స్టార్ సినిమా చూద్దాం అనుకున్నవాళ్లకు ‘సినిమా’ చూపించాడు. ఎందుకంటే ఇది అసలు సినిమా కాదు. పైగా కేవలం 37 నిమిషాల నిడివి మాత్రమే ఉంది.

అంటే ఓ పెద్ద షార్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. పోనీ అదైనా పర్ఫెక్ట్ గా ఉందా అంటే అంత లేదు. ఇంకా చెబితే ఇదో కామెడీ స్పూఫ్. ఊహించిన దానికి భిన్నంగా.. కేవలం ఫ్యాన్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ తీశానని చెప్పిన వర్మ.. సినిమాలో సంగతి ఏమో కానీ.. సినిమా చూపించే విషయంలో మాత్రం ఫ్యాన్స్ నే టార్గెట్ చేశాడు. షాక్ ఇచ్చాడు. ఓ సంపూర్ణేష్ బాబు లాంటి యాక్టర్ తో ఇతర  మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో కామెడీ కోసం క్రియేట్ చేసిన స్పూఫ్ ను తలపించేలా ఉన్న ఈ పవర్ స్టార్ తో వర్మ చాలా క్యాష్ చేసుకున్నాడనే చెప్పాలి. కేవలం వేలల్లో మాత్రమే రూపొందించిన సినిమా అని అర్థం అవుతోంది. మెయిన్ ఆర్టిస్టులకు రెమ్యూనేషన్స్ తీసేస్తే.. ఓ పదివేలు కూడా ఖర్చు లేదు అనిపిస్తుంది. మొత్తంగా కొండంత రాగం తీసి.. శుభాకాంక్షలు సినిమాలో ఏవియస్ పాట పాడినట్టుగా పవర్ స్టార్ తో ఫ్యాన్స్ ను ఫూల్స్ ను చేశాడు రామ్ గోపాల్ వర్మ.

tollywood news