చంద్రబాబు ఫ్యామిలీ పై వర్మ ట్వీట్

RGV Tweets on Chandrababu Family – BABU Complaint

సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన రాం గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఇక ఆపోస్ట్ లో చంద్రబాబు ఫ్యామిలీ పై ఆయన వేసిన సెటైర్లు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబును వెన్నుపోటు దారుడిగా చూపించే యత్నం చేసిన వర్మ తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ సీఎం చంద్రబాబును అవమానించే విధంగా చంద్రబాబు కుటుంబం ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్త ఒకరు హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యదు చేశారు.

చంద్రబాబు వైసీపీలో చేరారంటూ ఒక పోస్ట్.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కుటుంబానికి పించన్, సచివాలయం జాబ్, అమ్మ ఒడి పథకం, బాలకృష్ణకు మెరుగైన వైద్యం అందిస్తారంటూ ఫోటోను ఎడిట్ చేసి పెట్టగా.. ఆ ఫోటోపై బాలకృష్ణను, చంద్రబాబును కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదుదారు తెలిపారు.
బాచుపల్లికి చెందిన దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామ్‌గోపాల్‌వర్మ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తే లేదని, వర్మ ఓ పనికిమాలినవాడు, మూర్ఖుడని, మతిభ్రమించి ఏం చేస్తున్నాడో తనకే తెలియదని విమర్శించారు. రాత్రికి తాగేసి పొద్దున దిగగానే ఏం చేస్తాడో వర్మకే తెలియట్లేదని, ఏ పార్టీకి చెందని వ్యక్తిని అంటూనే తాగేసిన తర్వాత వైసీపీ వాడినని చెప్పుకుంటాడని ఫిర్యాడుదారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *