ఊటీ వెళ్లి వచ్చే సరికి ఇల్లు లూటీ…

robbed from techie house in hyderabad

భాగ్యనగరంలో దొంగలు స్వైర  విహారం చేస్తున్నారు. ఎవరైనా ఇల్లు వదిలి వేరే ఊర్లకు ప్రయాణాలు చేస్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు ఎంత చెప్తున్నా పట్టింపు లేనట్టు వ్యవహరించే చాలా మంది తీరా దొంగతనం జరిగాక లబో దిబోమనటం పరిపాటిగా మారింది. హైదరాబాద్ నగరంలో  తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు .  శివారు ప్రాంతాలను టార్గెట్ చేసే దొంగలు ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఇళ్లను కూడా టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నారు.  హైదరాబాద్ లోని నల్లకుంట ఏరియాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం నివసిస్తోంది.  పెళ్లి వేడుకలను జరుపుకోవడానికి ఆ కుటుంబం ఊటీ వెళ్ళింది.

తాళం వేసి ఉండటంతో అదే అదునుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు.  ఇంట్లోకి దూరి బంగారు, వెండి నగలు దోచుకుపోయారు.  కిటికీలు తెరిచి ఉండటంతో ఇంటి ఓనర్ ఫోన్ చేసి ఎప్పుడు వచ్చారని ప్రశ్నించడగా, ఇంకా రాలేదని సమాధానం చెప్పారు.  తరువాత రోజున ఇంటికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంటిని చూసి షాక్ అయ్యారు.  దొంగతనం జరిగిందని అర్ధం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  32 తులాల బంగారం కిలో వెండి నగలు అపహరణకు గురైనట్టు కంప్లైంట్ ఇచ్చారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

robbed from techie house in hyderabad,ooty , looty , hyderabad, software engineer , theft , house , robberyCash, jewellery stolen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *