రోజాకు మంత్రి పదవి ఇస్తే బాగుండేది

ROJA SHOULD BE GIVEN MINISTER POST

కాంగ్రెస్ పార్టీ లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీనటి రోజా విషయంలో కూడా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో సినీ నటి రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ట్వీట్ చేశారు. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని తను అభిప్రాయంగా చెప్పినా విజయశాంతి సినీరంగం నుండి రాజకీయ రంగానికి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటూ పేర్కొన్నారు. సినీ రంగం నుంచి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలను వినియోగించుకునేలా ప్లాన్ చేయాలని ఆమె సూచించారు. సినీరంగం నుండి వచ్చినవారికి తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని ఆమె తన అభిప్రాయం గా చెప్పారు. ఇప్పటికైనా రోజా విషయంలో జగన్ పునరాలోచించాలని ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బావుంటుందని జగన్ కు విజయశాంతి సూచన చేశారు .

ఇదే సమయంలో కెసిఆర్ పై మండి పడిన విజయశాంతి కేసీఆర్ తన మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మహిళను లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఐదేళ్లు ఇదే ప్లాన్ తో ఉన్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పుపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నానన్న విజయశాంతి జగన్ మంత్రివర్గంపై ఇప్పుడు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉపముఖ్యమంత్రి పదవి తో పాటు, అత్యంత కీలకమైనహోంశాఖను సైతం కేటాయించి మహిళలకు సముచిత స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. కనీసం జగన్ చూసైనా కెసిఆర్ మారతారా? అని ప్రశ్నించారు విజయశాంతి.

VIJAYASHANTI SENSATIONAL COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *