రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి: సెల్వమణి

7
Farmers Blocked MLA Roja in Amravati
Farmers Blocked MLA Roja in Amravati

వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగినట్టు ఆమె భర్త సెల్వమణి వెల్లడించారు. ‘చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. సోమవారం ఆమెను ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు. మరో రెండు వారాలు రోజా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. నిజానికి ఈ ఆపరేషన్లు గతేడాదే చేయాల్సి ఉంది. అయితే, గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం రోజా బాగానే ఉన్నారని.. ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆమెను చూసేందుకు సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దు’ అని సెల్వమణి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ఆడియో విడుదల చేశారు.