Roshan in Pellisandadi
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెంటిమెంట్, కామెడీ, మ్యూజిక్, ఫ్యామిలీ విలువలు… ఇలా అన్ని జానర్లవాళ్లను ఆకట్టుకుంది. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు..
అయితే ఇదే టైటిల్ తో ఒకే దర్శకుడితో తండ్రి కొడుకులు సినిమాలు చేయడం విశేషం.. ఇక ఇప్పటికే రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. తిరిగి గ్యాప్ తీసుకొని రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి..