అల్లూరిగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్

Spread the love

RRR MOVIE DETAILS

  • ఆర్ఆర్ఆర్ విశేషాలు వెల్లడించిన రాజమౌళి
  • 1920 బ్యాక్ డ్రాప్ లో సినిమా

సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన విశేషాలను ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వెల్లడించారు. 1920లో జరిగిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఓ కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నట్టు దర్శకుడు రాజమౌలి తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు ముందే సినిమా గురించి చెప్పడానికి ఇష్టపడతా. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడేళ్లపాటు ఇంటిపట్టున లేదు. తిరిగొచ్చాక స్వాతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. వారిద్దరి చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి కథకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. మాకు అంతే భారీ తారాగణం ఉంది. అజయ్‌ దేవగణ్‌ సినిమాకు ఒప్పుకొన్నారు. మెసేజ్‌ పెట్టగానే ఓకే అన్నారు. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారు. తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఉన్నారు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. చాలామంది డిస్ట్రిబ్యూటర్ల ఇదే టైటిల్ ఉంచమంటున్నారు. సినిమాకు అన్ని భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అనే కామన్‌ టైటిల్‌ ఉంటుంది. ఒక్కో భాషలో ఒక్కో విభిన్న టైటిల్‌ ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం’’ అని రాజమౌళి తెలిపారు. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళం, మళయాళంతోపాటు మొత్తం 10 భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు చెప్పారు.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *