2021 జనవరిలో ఆర్ఆర్ఆర్ రిలీజ్

RRR RELEASE @ 2021 JANUARY
2020లో సినిమా వారికి సంబంధించి ఇంతకంటే మరో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉండదేమో. అవునుమరి..  ఇప్పటికే ఈ యేడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏకంగా వచ్చే యేడాది జనవరి 8కి వెళ్లింది. అయితే లేటెస్ట్ గా ఆ డేట్ నుంచి కూడా వాయిదా పడింది అంటున్నారు. కర్ణుడి చావుకు నూరుకారణాలు అన్నట్టుగా ఈ పరిస్థితి ఉంది. మామూలుగా ఆరంభం నుంచే అనేక ఇబ్బందులు పడుతోందీ సినిమా. మామూలుగా అయితే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ యేడాది జవనరిలోనే ఈ మూవీ నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కానీ గతేడాది రెండు మూడు షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడతో లేట్ అయింది. అందుకే ఈ మే వరకూ వారి డేట్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు రాజమౌళి. దానికి తోడు హీరోయిన్లు కూడా ఇబ్బంది పెట్టారు. మొత్తంగా ఇక పోస్ట్ పోన్ అయితే అయింది అనుకున్న టైమ్ లో ఇప్పుడు సడెన్ గా అలియా భట్ కూడా హీరోయిన్ గా తప్పుకుంది. దీంతో రాజమౌళికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ కూడా ఆగిపోయింది. మళ్లీ ఎప్పటి వరకూ షూటింగ్ కు అనువైన సిట్యుయేషన్స్ ఉంటాయని కూడా చెప్పలేకపోతున్నారు. అందువల్ల షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఈ కారణంగానే సినిమాను జనవరిలో కూడా విడుదల చేయడం అసంభవం అంటున్నారు. అయితే ప్రొడక్షన్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా చాలా క్లియర్ గా చెక్కడం జక్కన్న స్టైల్. ఏదీ హడావిడీగా ఉండదు. ఉంటే అసలుకే మోసం వస్తుంది. అందుకని సంక్రాంతి బరిలో కాకుండా సమ్మర్ లోనే ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలనుకుంటున్నారని పక్కా సమాచారం. మరి ఇదే నిజమైతే ఇక సంక్రాంతికి మళ్లీ స్టార్ వార్ మొదలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *