Rtc Employee Died Due To Depression
ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 రోజు కొనసాగుతుంది. అయినా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావటం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న తీవ్రమైన డిస్మిస్ నిర్ణయంతో డిప్రెషన్ కు లోనైన ఆర్టీసీ కార్మికుడు మతి స్థిమితం కోల్పోయాడు. నవంబర్ 5లోపు చేరాలని కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ చూసి కలత చెందిన సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వరరావు తీవ్ర డిప్రెషన్ కు గురై మతిస్తిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వరరావు నవ్వుతూ ఏడుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గురువారం పరిస్థితి విషమించి నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వరరావు నారాయణ ఖేడ్ డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా చేస్తున్నాడు. నాగేశ్వరరావు మృతితో పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. ప్రస్తుతం రెండు నెలలుగా జీతాలు లేక అద్దెకట్టేలేని స్థితిలో వీరి ఫ్యామిలీ ప్రస్తుతం అత్తవారింట్లో తలదాచుకుంటోంది.
తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీలో బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని