గవర్నర్ వద్దకు చేరిన ఆర్టీసీ పంచాయతీ

RTC Issue reached to Governor

తెలంగాణ గవర్నర్ వద్దకు ఆర్టీసీ పంచాయతీ చేరింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ ప్రతినిధులు గవర్నర్ కు సమాచారం అందించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆర్టీసీ సమ్మె మరియు రాష్ట్ర పరిస్థితిపై గవర్నర్ కి వినతి పత్రాన్ని ఆర్టీసీ నాయకులు అందజేశారు. రాష్ట్రంలో దహణకాండ పై గవర్నర్ కి అన్ని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని.. మంత్రులు రోజుకో మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారు అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ లో స్వేచ్చలేదని మండిపడ్డారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఆర్టీసీ పై అన్ని సమస్యల పై ఉద్యోగాల సంఘాలతో మాట్లాడమని, కారం రవీందర్ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె మద్దతు కోరామని చెప్పుకొచ్చారు.  ఉద్యోగ సంఘాలు సీఎం ని కలవడాన్నీ తప్పు పట్టడం లేదన్నారు. ఉద్యోగాల సంఘాలతో కలిసేందుకు నిన్న కోరాము కానీ శ్రీనివాస్ రెడ్డి మరణం తో కలవడం కుదరలేదని వివరించారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని.. తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు.

మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్  రాజీ రెడ్డి తెలిపారు. తమ సమస్య పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని సూచించారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ..  ఆర్టీసీ సమస్యపై మంత్రులు రెచ్చగొట్టే విధానం మార్చుకోవాలని హితువు పలికారు. కేకే రాసిన లేఖ పై తాము ఓపెన్ గానే ఉన్నామన్నారు.

RTC STRIKE LATEST UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *