ఉద్యమాలతో సీఎం అయ్యి ఉద్యమాలనే అణచివేత

rtc jac attacked cm kcr
ఆర్టీసీ కార్మికులపై ఉద్యోగాల తొలగింపు వేటు వేస్తామని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్ మరోమారు సమీక్ష నిర్వహిస్తుంది. తెలంగాణా సర్కార్ నిరంకుశ విధానాలకు నిరసనగా   ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె ఎంతమాత్రమూ న్యాయసమ్మతం కాదని ఒకవైపు ప్రభుత్వం వాదిస్తుండగా ఆర్టీసీ కార్మిక నేతలు ముమ్మాటికి మాది న్యాయసమ్మతమే అని స్పష్టం చేస్తున్నారు. తాము ఈ విషయంపై న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని సలహా చెప్పారని జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి స్పష్టం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు భయపడేది లేదని, సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదని అన్నారు. ఉద్యమాలతో సీఎం అయ్యి, ఉద్యమాలను అణచివేసే సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే పాలేరులం కాదని, తమకు 50 వేల జీతమంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీతో పోల్చి ఆర్టీసీ గురించి మాట్లాడాలని, ఇత రాష్ట్రాలతో కాదని తేల్చి చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణ బుధవారం ప్రకటిస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులు గానీ, అటు ప్రభుత్వం కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు.

tags: TSRTC strike,  kcr, K Chandra Sekhar Rao, Telangana Government, rtc workers unions , JAC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *