చర్చలకు పిలిచే అవకాశం విలీనం మినహా మిగతా అంశాలపై చర్చ

RTC jac discussions with cm kcr

ఆర్టీసీ సమ్మెపై  ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు సమ్మె విషయంలో తన ఆదేశాలను  ప్రభుత్వానికి తెలియజేస్తూ పంపించిన  హైకోర్టు  ఆర్డర్ కాపీ  ప్రభుత్వానికి చేరింది. ఇక ఇందులోని కోర్టు ఆదేశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించటానికి  ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశాలున్నాయి. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చ జరపాలన్న హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. తీర్పు కాపీని మంత్రి పువ్వాడ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
tags : trs rtc strike, rtc strike, high court, rtc jac discussions, cm kcr

అర్చకులకు శుభవార్త చెప్పిన వైసీపీ ప్రభుత్వం

బోటులో మృత దేహాలు ఎన్ని ఉన్నాయంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *