మరోసారి పోరాటానికి సిద్ధమంటున్న ఆర్టీసీ సంఘాలు

RTC JAC warning to TRS Governament

ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిన ఆదేశాలు అమలు కావడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారని, అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్‌ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్‌ కమిషన్‌ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అశ్వద్ధామ రెడ్డి.

tags : RTC, Telangana RTC, Ashwatthama Reddy, RTC JAC, CM KCR, Government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *