ఆర్టీసీ సమ్మె చలో ట్యాంక్‌బండ్

RTC Strike At Tankbund

తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు ఇచ్చిన చలో ట్యాంక్‌బండ్ శనివారం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదు లోని బీఆర్కే భవన్ వద్ద గుమికూడిన కార్మికులు ఒక్కసారిగా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ట్యాంకు బండ్ వైపుకు దూసుకు వచ్చారు. బారీకేడ్లు, కంచెలు దూకి ట్యాంక్ బండ్ మీదుగా మహిళా కార్మికులు దూసుకెళ్లారు. పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్యన తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వందలాది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ తరలించారు.మరికొందరు కార్మికులు ఎంబీ భవన్ నుంచి ట్యాంక్ బండ్‌కు ప్రదర్శనగా వెళ్లారు. తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, విమలక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ర్యాలీగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చలో ట్యాంక్ బండ్‌తో సకల జనుల సామూహిక దీక్షకు ఆర్టీసీ జేఏసీ ప్లాన్ చేసింది. అయితే పోలీసులు దీనిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పలువురు ఆర్టీసీ కార్మికులు పోలీసుల ఆంక్షలు చేరుకొని వెళ్లి, ట్యాంక్ బండ్ పైన బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఆర్టీసీ కార్మికులు, కార్మిక నేతలను పోలీసులు ముందు నుండే ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు జేఏసీ నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాదులో వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు.హైదరాబాదుతో పాటు వివిధ జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు జరిగాయి.

tags : tsrtc strike, ts rtc, rtc strike, rtc workers, #chalotankbund, tension, police arrest, protest

అజిత్ ధోవల్ తో అమిత్ షా భేటీ ఎందుకు?

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *