ఆర్టీసీ సమ్మె కేసు ఈనెల 18కి వాయిదా 

RTC Strike Case Postponed to 18th November

ఆర్టీసీ సమ్మె కేసు ఎటూ తేలటం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వివాదాన్ని లేబర్ కమీషనర్‌కు బదీలీ చేయాలని ప్రభుత్వం కోరింది. చట్టవ్యతిరేకమైన సమ్మెను విచారించి ఆదేశాలు జారీ చేసేందుకు.. హైకోర్టుకు అధికారాలు లేవని స్పష్టం చేసింది. సమ్మె అనేది కార్మికుల సమస్యలతో కూడిన అంశం కాబట్టి… లేబర్ కమీషనర్ కార్యాలయానికిబదీలీ చేయాలని కోరింది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ ఈనెల 18న వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై తీర్పు మరోసారి వాయిదా పడింది. సమ్మెపై నేడు వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే ఈనెల 18కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సంబంధించి ఎలాంటీ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకరించకపోవకపోవడంతో సమస్య మరింత జఠిలం కానుట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెను విచారిస్తున్న కోర్టుకు పూర్తి అధికారులు లేకపోవడంతో లేబర్ కోర్టుకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ప్రస్తుతం కోర్టులో కొనసాగుతున్న వాదనలు మళ్లి మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నలబై రోజులుగా సమ్మె కొనసాగుతుండగా…  ఒకవేళ లేబర్ కమీషనర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలోనే పలు అంశాలు మరోసారి చర్చకు రానున్నాయి. దీంతో చర్చలు మొదటికి రానున్నాయి. మరోవైపు లేబర్ కమీషనర్‌ విచారణ అనంతరం కూడ తిరిగి లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని మంగళవారం జరిగిన వాదనల్లో పిటిషనర్ తరుఫున న్యాయవాది వివరించారు. అయితే అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుండడంతో సమస్య తిరిగి మళ్లి మొదటికి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం మరోసారి వాదనలు జరగనుంది.

tags : tsrtc strike, high court, high power committee, supreem court retired judges, telangana government, review, verdict,  labour commission

మహబూబాబాద్ లో  మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

సినీ నటుడు రాజశేఖర్ కు మేజర్ యాక్సిడెంట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *