ఆర్టీసీ కార్మిక సమ్మె యథాతథం అన్న అశ్వత్థామరెడ్డి

RTC Strike will continue

ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి యూటర్న్ తీసుకుంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం బేషరతుగా ఆహ్వానిస్తే, సమ్మెను విరమిస్తామని ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, నేడు తిరిగి సమ్మెను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. నిన్నటికి నిన్న అశ్వద్ధామ రెడ్డి అసమర్ధుడు, ఇంత మంది కార్మికులు మృతి చెందిన, కార్మికుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా, సమ్మెను విరమిస్తానని ప్రకటించారు అని టీజేఎంయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వద్ధామ రెడ్డి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినా, కార్మికుల సమ్మె కొనసాగిస్తారని తేల్చి చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు మరోమారు ఆర్టీసీ కార్మిక జెఎసి సమ్మెను కొనసాగిస్తున్నట్లు గా తమ నిర్ణయాన్ని వెల్లడించింది. సమ్మె భారతంలో కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం రాలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టాల్లో ఉందని ఆరోపించిన ఆయన, సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాము ఎన్నో మెట్లు దిగొచ్చి, సమ్మెను విరమిస్తామని ప్రకటించినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. శనివారం నాడు అన్ని డిపోల వద్దా సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలకు దిగనున్నామని తెలిపారు. తమకు డ్యూటీలు వేయాలని ఎవరూ అధికారుల వద్దకు వెళ్లవద్దని ఆయన సూచించారు. రేపు మరోసారి జేఏసీ నేతల సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

tags: ts rtc strike, rtc strike, rtc jac, ashwatthama reddy, rtc workers union, cm kcr, telangana, tjmu, hanumanthu

జబర్దస్త్ షో నుండి బయటకు రావడానికి కారణాలివే…

బాలయ్య రూలర్ టీజర్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *