టెన్షన్ లో కార్మిక లోకం … కేసీఆర్ కరుణిస్తారా?

Spread the love
RTC Workers Are in Tension

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇన్ని రోజుల పాటు సాగిన ఫలితం సాధించలేకపోయింది. ప్రభుత్వాన్ని ఏమాత్రం కదిలించలేక పోయింది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెట్టు దిగేలా చేయలేకపోయింది. అక్టోబర్‌ 5న మొదలైన సమ్మె నవంబర్‌ 20న ముగిసింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సుదీర్ఘ సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ సకల జనుల సమ్మెలో భాగంగా కార్మికులు ఆందోళనలో పాల్గొన్నప్పటికీ ఆర్టీసీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సమ్మెల్లోకెల్లా ఇదే అతి పెద్ద సమ్మెగా నిలిచిపోయింది.

ఎన్ని రోజుల పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు న్యాయం చేస్తుందని భావిస్తే హైకోర్టు లేబర్ కోర్టులోకి బంతిని నెట్టి చేతులెత్తేసింది. ఇక దీంతో విధి లేని పరిస్థితుల్లో షరతులు విధించడకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరుణిస్తాడా ఇప్పటికైనా అన్నది ప్రధాన చర్చగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 46 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ సమ్మెను ప్రభుత్వం మొదటి నుంచి చట్టవిరుద్ధంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండుసార్లు గడువు విధించింది. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించకుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండుసార్లు విధించిన గడువుల్లో కొందరు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కార్మికులంతా డ్యూటీలో చేరడానికి సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా అన్నది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ముందున్న పెద్ద ప్రశ్న. ఇక ఈ రోజు సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

tags: ts rtc strike, rtc strike, rtc jac, ashwatthama reddy, rtc workers union, cm kcr, telangana, government

పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా వైసీపీ ఎంపీలు

చెన్నమనేని రమేశ్‌ వర్సెస్ ఆది శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *