విలీనంపై వెనక్కు తగ్గమన్న ఆర్టీసీ కార్మిక జేఏసి 

RTC workers JAC declines on merger

ఆర్టీసీ సమ్మె సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య ఏకాభిప్రాయం రావటం లేదు. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచేయి సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. చర్చలకు ప్రభుత్వమే దిగిరావాలని కార్మికులు కొరుకుంటుంటే ..ప్రభుత్వం మాత్రం కార్మికులే దిగిరావాలని భావిస్తోంది. దీంతో విరుద్ద ప్రకటనలు, వింత వాదనలు ఇరు వర్గాలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ సమ్మె 20 రోజుకు చేరకుంటున్నా ఇరు వర్గాల మధ్య స్పష్టత వచ్చినట్టు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ వైపు కోర్టు వాదనల ప్రకారం ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్‌గా తీసుకువస్తున్న విలీనం అంశాన్ని వీడితేనే చర్చలు అంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీని విలీనం చేయాలంటూ చర్చల్లో పట్టుపట్టబోమని కోర్టులో కార్మిక సంఘాల తరఫున వాదించిన అడ్వకేట్ చెప్పారని, దీంతో కార్మికుల విలీనం డిమాండ్ నుండి వెనక్కి తగ్గారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు లేవనెత్తిన 21 డిమాండ్ల అంశంపై అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్మికుల డిమాండ్లను పరీశీలించి రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇందుకోసం అధికారులతో వేసిన కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఈడీలు బుధవారం ఆర్టీసీ బస్‌భవన్‌‌లో సమావేశం అయ్యారు. కాగా వీలీనం సమస్య లేకుండా అధికారులు ఇచ్చిన నివేదిక పై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఇదే నివేదికకు సంబంధించిన అంశాలను కూడ ఈనెల 28న చేపట్టనున్న కోర్టు విచారణలో కూడ నివేదించనున్నారు.
ఇక ఈ అంశంపై  నేడు కార్మిక సంఘాల ప్రతినిధులు స్పందించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు తాము ఆర్టీసీ విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలే లేవని ఆర్టీసీ జేఏసీ కన్వినర్ ఆశ్వథ్దామ రెడ్డి స్పష్టం చేశారు. నేడు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఆయన ఎబీనగర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విలీనంతో పాటు ఏ ఒక్క డిమాండ్‌ను వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశాడు. అవసరమైతే ఆర్టీసీ సమ్మె ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లండని ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాడు. ప్రజల్లో ఆర్టీసీ సమ్మె అన్యాయమని తేలితే.. సమ్మె నుండి తక్షణమే తప్పుకుంటామని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీని విలీనం చేయడంలో సీఎం కేసీఆర్‌కు ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.దీంతో ఇరువర్గాలు విలీనంపై పట్టువదలకుండా తమ ప్రయాత్నాలు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.సమ్మెపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడాలంటే కోర్టు సీరియస్‌గా జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు.
tags : tsrtc strike, rtc strike, rtc workers, rtc employees, merger issue, discussions

ఈసారి సింగరేణి  కార్మికుల దీపావళి బోనస్ అదుర్స్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *